ETV Bharat / state

సైబర్​ నేరగాళ్ల నయా పంథా.. బహుమతుల పేరిట ఖాతాల్లో డబ్బులు లూటీ - cyber crime latest news

కొత్తగా ఫేస్​బుక్​లో లండన్​, మెక్సికో, కెనడా అంటూ ఫ్రెండ్స్​ పరిచయమయ్యారా..? తర్వాత వాట్సాప్​లో మాట్లాడుతున్నారా...! అయితే జాగ్రత్త ఇది సైబర్​నేరగాళ్ల కొత్త పంథా.. డొమినిక్,​ జెన్నిఫర్​ పేర్లతో ఎవరైనా మీకు పరిచయమై బహుమతులు పంపాం.. తీసుకోండంటూ ఫోన్లు చేస్తే కాస్త భద్రం సుమా. ఇలా మాయాజాలం ప్రదర్శించి కేవలం పదమూడు రోజుల్లోనే 9మంది నుంచి రూ. 45 లక్షలు కొల్లగొట్టారు.

cyber crime latest techniques
సైబర్​ నేరగాళ్ల నయా పంథా.. బహుమతుల పేరిట ఖాతాల్లో డబ్బులు లూటీ
author img

By

Published : Jul 14, 2020, 6:32 AM IST

సైబర్‌ నేరస్థులు పంథా మార్చారు. ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త తరహా మోసాలకు తెరదీశారు. లండన్‌, కెనడా, మెక్సికోల్లో ఉంటామంటూ స్నేహితులుగా పరిచయం చేసుకుంటున్నారు. తరవాత వాట్సాప్‌ ద్వారా మాట్లాడతారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాక మోసాలకు తెరదీస్తారు. మీ రక్షణకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని, స్నేహానికి గుర్తుగా లాప్‌టాప్‌లు, ఐ-ఫోన్లు, డాలర్లు, పౌండ్లు బహుమతిగా పంపుతామంటూ నమ్మిస్తున్నారు. తరవాత మాయాజాలం ప్రదర్శించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలా 13 రోజుల్లోనే 9 మందిని మోసగించి రూ.45 లక్షలు కొల్లగొట్టారు. దిల్లీ, ముంబయిలో ఉంటున్న నైజీరియన్లు ఈ మోసాలు చేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

డొమినిక్‌.. జెన్నిఫర్‌ పేర్లతో..

మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా డొమినిక్‌, జెన్నిఫర్‌ పేర్లను ఉపయోగిస్తున్నారు. యువతులు, మహిళలను డొమినిక్‌ పేరుతో పరిచయం చేసుకొని ఇంజినీర్‌ లేదా వైద్యనిపుణుడినని చెబుతున్నారు. అందమైన యువతి ఫొటోతో జెన్నిఫర్‌ పేరిట ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించి స్నేహం చేసుకోవాలంటూ యువకులకు అభ్యర్థనలు పంపుతున్నారు. పరిచయమయ్యాక వాట్సాప్‌ ద్వారా మాట్లాడదాం అని +44 సీరిస్‌ నంబరు నుంచి మాట్లాడుతున్నారు. అది చూసి నిజంగానే లండన్‌ నుంచి మాట్లాడుతున్నారని బాధితులు భావిస్తున్నారు. స్నేహానికి గుర్తుగా బహుమతులు పంపుతున్నామని దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ ఛార్జీలు చెల్లించి తెప్పించుకోవాలంటూ సూచిస్తున్నారు.

రకరకాల పన్నుల పేరుతో దోచేస్తారు...

తొలుత విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌ చేస్తారు. రూ.20 వేలు బదిలీ చేస్తే మీ చిరునామాకు పార్సిల్‌ పంపుతామంటారు. నగదు బదిలీ చేయగానే.. రూ.కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని పంపామని తీసుకోవాలంటే అంతర్జాతీయ పన్ను, ఆదాయ పన్ను చెల్లించాలంటూ సూచిస్తారు. నమ్మి సైబర్‌ నేరస్థుల ఖాతాల్లో నగదు వేస్తున్నారు. ఇలా రూ.5-6 లక్షలు వచ్చాక కేంద్ర హోంశాఖ, దిల్లీ పోలీసుల పేర్లతో ఫోన్లు చేస్తారు. విదేశాల నుంచి డాలర్లు తెప్పించుకున్నందుకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.