సైబర్ క్రైం మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంత సులువుగా ఎలా మోసం చేస్తారా అనే అనుమానం రావడం సహజం... రోజు ఎన్నో చూస్తున్నా... చదువుతున్నా.. ఎంత తెలివైన వారైన సులువుగా మాయగాళ్ల బుట్టలో పడిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ వస్త్ర దుకాణం యజమాని ఖాతా నుంచి 1,28,000 కాజేసింది ఓ మాయలేడి.
అసలు ఏమైందంటే...
పవన్ అగర్వాల్‌కు చార్మినార్ వద్ద వస్త్ర దుకాణం ఉంది. బుధవారం అతనికి ఓ మహిళ ఫోన్ చేసి తాను డిఫెన్స్ అధికారిణి అంటూ పరిచయం చేసుకుని... వీడియో కాల్ చేస్తాను చీరలు, సూట్లు చూపించాలని కోరింది. సుమారు 54వేల విలువైన వస్త్రాలు ఎంపిక చేసుకుంది. వాటిని ప్యాక్ చేయించి... బిల్లు సిద్ధం చేయాలని కోరగా అలాగే చేశాడు.
డబ్బులు పంపిస్తే వెంటనే డెలివరీ ఇచ్చేస్తామని పవన్ అగర్వాల్ ఆమెకు చెప్పాడు. ఆన్లైన్లో వెంటనే పంపిస్తానంటూ క్యూఆర్ కోడ్ పంపింది. దానిని స్కాన్ చేయగానే క్షణాల్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి 1,28,000 వేలు డ్రా అయినట్లు సందేశం వచ్చింది. మహిళకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి..