ETV Bharat / state

తెల్లని మోసం... తేమ పేరుతో ధరలో కోత!

పత్తి పంటకు వర్షాలు శాపంగా మారాయి. దూదిలో తేమ శాతం ఎక్కువగా ఉందన్న నెపంతో వ్యాపారులు అడ్డగోలుగా ధర తగ్గిస్తున్నారు. ఈనెల నుంచి ఏడాది పాటు క్వింటా పత్తికి రూ.5,825 మద్దతు ధర చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఈ ధర ఇవ్వాలంటే తేమ 8 శాతమే ఉండాలనే షరతు పెట్టింది. అంతకన్నాఎక్కువ ఉందంటూ వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 23న వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు 19,459 బస్తాల పత్తి రాగా... క్వింటాకు రూ.2,000 నుంచి రూ.4,800 వరకే ఇచ్చారు. తేమ 30 శాతానికి పైగా ఉన్నందునే ధరలు తగ్గిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Cuts in the price that cotton is high in moisture
తెల్లని మోసం... తేమ పేరుతో ధరలో కోత..!
author img

By

Published : Oct 25, 2020, 7:23 AM IST

రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో 60.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 4 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌శాఖ అంచనా. వర్షాలతో 50 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గుతుందని జిన్నింగ్‌ మిల్లుల అంచనా. రాష్ట్రంలో 348 జిన్నింగ్‌ మిల్లులు, మరో 8 మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా... సీసీఐ ఇప్పటివరకు ఒక్కటీ తెరవలేదు. కలెక్టర్లు ఇప్పటివరకు 74 జిన్నింగ్‌ మిల్లులనే సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశారు. మద్దతు ధరకు కొంటామని సీసీఐతో మిగిలిన మిల్లులు ఇంకా ఒప్పందాలు చేసుకోలేదు. పత్తిలో తేమ ఎక్కువగా ఉంటోందని... వర్షాలు తగ్గేవరకూ వేచిచూడాలనే ధోరణితో మిల్లులున్నాయి. వర్షాలతో దిగుబడి తగ్గితే మున్ముందు డిమాండ్​ ఏర్పడి ధర పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాల అంచనా.

తెల్లని మోసం..!

పారిశ్రామిక రాయితీ సొమ్ము విడుదల చేయాలి..

లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణలోని జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.400 కోట్ల నష్టాలు వచ్చాయి. గతేడాది సరఫరా చేసిన దూదికి సంబంధించిన సొమ్మును జిన్నింగ్‌ మిల్లులకు స్పిన్నింగ్‌ మిల్లులు 6 నెలలుగా చెల్లించడం లేదు. కొత్త పంటను కొనేందుకు జిన్నింగ్‌ మిల్లుల దగ్గర డబ్బు లేదు. మిల్లులను ఏర్పాటు చేస్తే పారిశ్రామిక రాయితీల కింద రూ.350 కోట్లు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో రూ.150 కోట్లు ఈ నెలాఖరుకు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ సొమ్ము విడుదల చేస్తేనే మద్దతు ధరకు జిన్నింగ్‌ మిల్లులు కొంటాయి.- బి.రవీందర్‌రెడ్డి, కె.రమేశ్‌, రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

వివరాలిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.