ETV Bharat / state

వారి మానవత్వం... ఒకరికి జీవం పోసింది!

మూగజీవాల మేత కోసం సుబాబుల్‌ చెట్టెక్కిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా ప్రాణాపాయం ఎదురైంది. ఆకులను కోస్తుండగా చెట్టు మధ్య నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యారు. అపస్మారక స్థితికి చేరిన ఆయన రెండుకొమ్మల మధ్య ఇరుక్కున్నారు. వెంటనే గమనించిన గ్రామస్థులు సకాలంలో స్పందించారు. ప్రాణాలకు తెగించి అతడిని కాపాడారు.

తోటి వారి సాహసం... నిలిపింది ప్రాణం...
author img

By

Published : Sep 23, 2019, 4:19 PM IST

తోటి వారి సాహసం... నిలిపింది ప్రాణం...

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన నన్నేబోయిన నరసింహారావు గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. మేత కోసం చర్చి సమీపంలోని సుబాబుల్‌ చెట్టుపైకి ఎక్కారు. కొమ్మలు నరుకుతూ కిందకు దిగుతున్న సమయంలో ఆకులు విద్యుత్‌ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. స్థానికులు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపేశారు. చెట్టు ఎత్తుగా ఉండడం వల్ల ఆయనను దించడం వారికి సాధ్యం కాలేదు. ముందుగా గ్రామానికి చెందిన పరిటాల రామకృష్ణ, వెంకయ్య నిచ్చెనల సాయంతో చెట్టుపైకి ఎక్కి కింద పడకుండా పట్టుకున్నారు. ఈలోగా కొందరు సమీపంలోని టోల్‌ వసూలు కేంద్రం అధికారులకు విషయం తెలిపారు. వారు ఘటనా స్థలం వద్దకు క్రేన్‌ తీసుకొచ్చారు.

క్షతగాత్రుడి నడుముకు తాడు కట్టి క్రేన్‌ సాయంతో నెమ్మదిగా కిందకు దించారు. అనంతరం అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు.

ఇవి చదవండి: గాంధీ వద్ద మౌనిక కుటుంబసభ్యుల ఆందోళన

Intro:యాంకర్: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని ఓ యువకుడు నిరూపించాడు సాధారణ వ్యాన్ డ్రైవర్ కుమారుడు గ్రామ సచివాలయం ఉద్యోగాల నియామకాల్లో రెండు కేటగిరీల్లో రెండు మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటాడు

Body:విశాఖ నగరంలోని ఓల్డ్ డైరీ ఫాం కు చెందిన సవ్వాన గోపికృష్ణ 2016 లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను తండ్రి కనక మురళి వ్యాన్ డ్రైవర్ గా పని పనిచేస్తూ అతికష్టం మీద గోపికృష్ణ ను ఇంజనీరింగ్ వరకు చదివించాడు తల్లి గృహిణి చిన్ననాటి నుండి పేదరికాన్ని చవిచూసిన గోపికృష్ణ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాయి జాన్ డ్రైవర్గా తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన గోపికృష్ణ ప్రభుత్వ ఉద్యోగం కోసం మూడేళ్లుగా పోటీ పరీక్షలకు కఠోర సాధన చేశాడు ఏపీపీఎస్సీ కి సిద్ధమవుతున్న గోపికృష్ణ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తు పెట్టి నాలుగు కేటగిరీలకు పరీక్షలు రాశాడు అందులో రెండు కేటగిరీల్లో వరుసగా రెండు మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు కేటగిరి 2 లో వీఆర్వో విలేజ్ సర్వేయర్ పోస్ట్ కు క్యాటగిరి 3 లో వార్డు ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు క్యాటగిరి 2 గ్రూప్ బి లో 118. 75 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు కేటగిరి 3 లో 93.25 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు గ్రామ సచివాలయం పోస్టులకు ఇచ్చిన సిలబస్ను చదవడం వల్లే ఈ మార్పులు వచ్చాయని గోపి కృష్ణ చెబుతున్నాడు. --------- బైట్ సవ్వాన గోపికృష్ణ గ్రామ సచివాలయం లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన అభ్యర్థి విశాఖ --------- వ్యాన్ డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్ట పడిన తండ్రి కనక మురళి కొడుకును కష్టపడి చదివినందుకు తగిన ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ అవసరాలకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో గోపికృష్ణ బ్యాంకులు సాధించాడని తల్లి లక్ష్మి చెబుతోంది గోపికృష్ణ గ్రామ సచివాలయం పోస్టుల్లో రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు సాధించాడని తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి గారు కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడ్డారు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు --------- బైట్ కనుక మురళి గోపికృష్ణ తండ్రి విశాఖ బైట్ లక్ష్మి గోపికృష్ణ తల్లి విశాఖ బైట్ కృష్ణకుమారి గోపికృష్ణ మేనత్త ---------

Conclusion:అనుకున్నది సాధించాలనే తపన కృషి పట్టుదల ఉంటే ఏదైనా ఇట్టే సాధించవచ్చని గోపి కృష్ణ నిరూపించాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఆ విభాగానికి చెందిన పోస్టులో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క చదువుకుంటూ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ( ఓవర్). (Note: Some more photos from Etv Whatsapp).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.