కొవిడ్-19 నియంత్రణ కోసం మానవ మోనో క్లోనల్ యాంటీ బాడీస్ తయారీకి భారత్ బయోటెక్‌కు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( సీఎస్ఐఆర్ ) అనుమతులిచ్చింది. న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ ( ఎన్ఎంఐటీఎల్ఐ ) ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్టును సీఎస్ఐఆర్... భారత్ బయోటెక్‌కి అప్పగించింది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్... నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రేడొమిక్స్ టెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేయనుంది.
మానవ శరీరంలోని కరోనా వైరస్‌ని ఈ మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అత్యంత వేగంగా నియంత్రిస్తాయి. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ... వ్యాక్సిన్ కంటే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ కరోనాను అడ్డుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?