ధరణి యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న పని తీరును ఆయన సమీక్షించారు. సాంకేతికపరమైన సమస్యలపై సిబ్బందితో మాట్లాడారు. ధరణి యాప్‌లో రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ధరణి యాప్ ప్రక్రియ సీఎం కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ప్రజల్లో ఉన్న అభద్రతాభావం పోగొట్టి అవగాహన కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: ఆస్తి నమోదుకు కుస్తీ.. ఆన్‌లైన్ ప్రక్రియలో ఇబ్బందులు