గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్‌లతో వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, బారీకేడ్లు, వైద్యబృందాలు, శానిటైజేషన్‌కు సంబంధించి... అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కమార్, మిలటరీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచండి: సీఎస్