వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌పై సంబంధిత అధికారులతో బీఆర్కే భవన్లో సమీక్షించారు.
ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ప్రతిరోజూ పెండింగ్ ఉన్న ఫిర్యాదుల స్థితిగతులను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి వాట్సాప్, ఈమెయిల్ తదితర రూపాల్లో స్పందన తెలిపేలా చూడాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: Rythu Bandhu: రైతు బంధు కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం