గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని బ్యాంకులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల శాఖలు మూసేయవద్దని కోరారు. రాష్ట్ర స్థాయి 27వ బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన బీఆర్కే భవన్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో రైతులు, సూక్ష్మ-చిన్న పరిశ్రమలు, స్వయంసహాయక సంఘాలు, వీధివ్యాపారులకు బ్యాంకులు బాగా సహకరించాయని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
వీధివ్యాపారులకు ఆర్థికసాయం అందించడంలో దేశంలో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపిన అధికారులు, బ్యాంకర్లను అభినందించారు. బ్యాంకర్ల సహకారంతోనే ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ... దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: ఈనెల 29న ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా