ETV Bharat / state

'ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని వేగవంతం చేయండి'

author img

By

Published : Oct 21, 2020, 3:57 PM IST

హైదరాబాద్​లో వరద ముంపు బాధితులకు ఆర్థిక సాయంపై అధికారులతో సీఎస్ సోమేశ్​కుమార్ సమీక్ష నిర్వహించారు. నగదు పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

'ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని వేగవంతం చేయండి'
'ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని వేగవంతం చేయండి'

హైదరాబాద్​లో వరద ప్రభావిత కుటుంబాలకు రూ. 10వేల ఆర్థికసాయాన్ని వేగవంతం చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఆర్థికసాయం పంపిణీ అంశంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

ఆలస్యం కాకుండా ఇంటి వద్దే నగదు పంపిణీ కోసం జీహెచ్ఎంసీలో 300, శివారు మున్సిపాలిటీల్లో 50 బృందాలను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ సంచాలకుల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పంపిణీని పర్యవేక్షించాలన్న సీఎస్... ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైతే జిల్లాల నుంచి అధికారులను సమకూర్చుకోవాలని చెప్పారు.

గ్రేటర్​లోని ప్రతి సర్కిల్​లో 10 బృందాలను ఏర్పాటు చేయాలని, వాటికి నగదు అందించేందుకు ప్రతి సర్కిల్​లో రూట్ ఆఫీసర్లను నియమించాలని తెలిపారు. నగదు పంపిణీ కోసం ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉంచాలని... సెలవు రోజుల్లోనూ పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడలని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్​ను సీఎస్ కోరారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.