ETV Bharat / state

కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి: సీఎస్ సోమేశ్​కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్​కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

cs somesh kumar
సీఎస్ సోమేశ్​కుమార్
author img

By

Published : Mar 30, 2021, 9:30 PM IST

రాష్ట్రంలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని... బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

పల్లెప్రగతి, ఉపాధిహామీ పథకం, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధరణి, కరోనా, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై సమీక్షించారు. రైతువేదికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ఉపాధిహామీ ద్వారా గ్రామాల్లో మంచి ఆస్తులను కల్పించినందుకు కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎస్ అభినందించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

అభినందనలు...

ప్రతి మండలానికి చెందిన ప్రత్యేకాధికారులు నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని కలెక్టర్లను కోరారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం అనువైన స్థలాలను కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలన్న సోమేశ్ కుమార్... రాబోయే ఆర్నెళ్లలో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో అద్భుతంగా కృషి చేశారని కలెక్టర్లను అభినందించిన ఆయన... పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

గ్రామాల్లో తగిన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సీఎస్... ఏ ఒక్క రైతు కూడా అసౌకర్యానికి గురికాకుండా కలెక్టర్లు చూడాలని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు, వేడుకల్లో కోవిడ్ ప్రోటోకాల్​ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: విద్యార్థినికి కరోనా.. పొలంలో ఐసోలేషన్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.