ETV Bharat / state

Rain Effect : పత్తి నల్లబారుతోంది... కంది వాడిపోతోంది! - తెలంగాణలో అధిక వర్షాలు

అధిక వర్షాలతో పంటలు నీట మునిగి పాడవుతున్నాయి. పలు చోట్లు పత్తి నల్లబారిపోతుండగా... కంది మొక్కలు వాడిపోతున్నాయి. గతేడాది అధిక వర్షాలకు పంటలన్నీ పాడై అప్పులే మిగిలాయనుకుంటే... ఈ ఏడాది కూడా వర్షాలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.

crops-are-damaged
నీట మునిగి పాడవుతున్నాయి
author img

By

Published : Sep 4, 2021, 9:10 AM IST

డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పెసర, మినుము పంటలు కొన్నయితే.. ఆశాజనకంగా ఉన్న పత్తి, కంది పంటలు సైతం నీట మునిగి ఎండిపోతున్నాయి. నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు భూముల్లో సాగవుతున్న పంటలు పాడయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంట పాడైతే రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి పరిహారం కోసం నివేదించేవారని, ఈ సారి ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జిల్లాలో 5,14,472 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సీజను ప్రారంభంలో మోస్తరు వర్షాలు కురవడంతో పంటల సాగు మొదలైంది. ఆ తరువాత ఇరవై రోజుల పాటు చినుకు జాడ లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టి దిగుబడిపై ప్రభావం చూపింది. మొక్కజొన్న పంట పూర్తిగా పాడైంది. ప్రస్తుతం అధిక వర్షాలతో నీట మునిగి పాడవుతున్నాయి. పత్తి పంట నల్లబారిపోతుండగా.. కంది మొక్కలు వాడిపోతున్నాయి. గతేడాది అధిక వర్షాలకు పంటలన్నీ పాడై అప్పులే మిగిలాయి. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరిస్తుందనుకుంటే నష్టం కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • బషీరాబాద్‌ మండలం నవాంద్గీ, జీవన్గీ, గంగ్వార్‌, ఇందర్‌చేడ్‌, తాండూరు మండలం గోనూరు, వీర్‌శెట్టిపల్లి, అగ్గనూరు కాగ్నానది పరీవాహక పంట పొలాలు వర్షాలకు నీట మునిగాయి. ఈ ఏడాది రెండుసార్లు భారీ వర్షాలు కురవడంతో పంట పూర్తిగా చేతికందకుండా పోయింది.
  • యాలాల మండలం జుంటిపల్లిలో రైతు నర్సింహులు నాలుగెకరాల్లో కంది పంటను సాగు చేయగా, పొలంలో నీరు చేరి మూడెకరాల్లో కంది ఎర్రబారి ఎండిపోయింది.
  • మర్పల్లి మండలానికి చెందిన ఓ రైతు ఆరెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. గత నెలలో వర్షాల జాడ లేకపోవడంతో పంట ఎండిపోయింది. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో దున్నేసి రబీ సాగుకు భూమిని చదను చేయాలని నిర్ణయించాడు.

అంచనాలకే పరిమితం..

అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు పాడైతే వెంటనే రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించేవారు. గత రెండేళ్లుగా పంట పాడైనా ఎలాంటి పరిహారం రాలేదు. ఈసారి జిల్లాలో పంటలు పాడైనప్పటికీ పరిశీలన చేయకపోవడం గమనార్హం. గతేడాది అధిక వర్షాలకు 76,357 మంది రైతులకు సంబంధించి 1,42,132 ఎకరాల్లో అన్ని పంటలు పాడైనట్లు నివేదిక సమర్పించారు. ఇందులో పత్తి 88వేల ఎకరాలు, కంది 33 వేలు, పెసర 13వేలు, ఇతర పంటలున్నాయి. ఇందులో యాభై శాతం పాడైన పంటలకే పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో 54,663 మందికి 98,899 ఎకరాల్లో పాడైందని గతేడాది అక్టోబరులో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు. వీటితో పాటు 2019 సంవత్సరానికి పాడైన పంట నివేదికను పంపగా ఎలాంటి పరిహారం అందలేదు. మొత్తం పరిహారం సుమారు రూ.300 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఎకరాకు రూ.5వేల రైతుబంధు సహాయం అందిస్తుండడంతో పరిహారం వచ్చే అవకాశాలు లేవని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

మూడెకరాల్లో పాడైంది

కౌలురైతు

నా పొలంతో పాటు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశా. మధ్యలో వర్షాలు లేక మొక్కజొన్న ఎండిపోయింది. పంటను దున్నేసి కుసుమ వేయాలని నిర్ణయించా. గతేడాది కూడా అధిక వర్షాలతో నష్టపోయా.

విజేందర్‌రెడ్డి, కౌలు రైతు, బూచన్‌పల్లి

పరిశీలించి నివేదిక పంపిస్తాం

పొలంలో వర్షపునీరు ఎక్కువరోజులు నిల్వ ఉండకుండా కాల్వ తీసి నీటిని పంపిస్తే పంట పాడవకుండా ఉంటుంది. భారీ వర్షాలకు నష్టమైన కంది, పత్తి, ఇతర పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తాం. పంట నష్ట పరిహారం నిధులు వస్తే రైతులకు అందజేస్తాం.

-గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్‌

సెనగ, రబీ కంది వైపు మొగ్గు..: ప్రస్తుతం పాడైన కంది, పత్తి పంటలను దున్నేసి రబీ సాగుకు భూమిని సిద్ధం చేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. పప్పు సెనగ, తెల్ల కుసుమ, జొన్న పంటను లేదా నీటి అవకాశం ఉన్న చోట్ల రబీ కంది సాగుకు యోచిస్తున్నారు. ఇటీవల బషీరాబాద్‌ మండలం పర్వతపల్లి, నవాంద్గీలో ఇరవై ఎకరాల్లో కంది పంటను దున్నేసి శుభ్రం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.