ఐస్‌క్రీం ప్రియుల కోసం ప్రముఖ కంపెనీ క్రీమ్‌స్టోన్ సరికొత్త ఐస్‌క్రీంలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధమాన సినీ కథానాయిక లయ సరికొత్త ఐస్‌క్రీం రుచులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. పలువురు మోడల్స్‌తో కలిసి వాటిని ఆరగిస్తూ సందడి చేశారు.
ఐస్‌క్రీం అంటే తనకి చాలా ఇష్టమని కథానాయిక లయ అన్నారు. కాఫీ హాజెల్, గువా నట్టి నట్స్, వింటాజ్, చాక్లెట్ బ్లాక్ కరెంట్ గో, బననా, వైట్ ఫారెస్ట్, క్రీమ్ కేక్ సీతాపల్, క్రీమీ టబ్ ఇలా పలు రకాలైన ఐస్‌క్రీమ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు క్రీమ్‌స్టోన్ మేనేజర్ ప్రాంక్లీన్ తెలిపారు.
ఇదీ చదవండి: దారి తప్పిన పన్ను 'పరిహారం'.. ప్రభుత్వాల మధ్య అంతరం