ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. వందల కోట్ల కార్మికుల సొమ్మును అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని కమ్యూనిస్టు నేతలు ఆరోపించారు. క్యాన్సర్ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేవని అన్నారు. దీనిపై ఆరు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సీపీఎం నేతలతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి : నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం