ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో సీపీఎం 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన - సీపీఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది

cpm contests 14 Constituencies in Telangana
cpm mla candidate list 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 9:45 AM IST

Updated : Nov 5, 2023, 10:38 AM IST

09:39 November 05

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో సీపీఎం 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

CPM MLA Candidate List సీపీఎం 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

CPM MLA Candidate List 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14 స్థానాల (CPM MLA Candidate List)కు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో పాటు మేనిఫెస్టోనూ విడుదల చేశారు. మరో మూడు స్థానాలైన నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ అభ్యర్థులను సాయంత్రం ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

1) భద్రాచలం : కారం పుల్లయ్య

2) అశ్వారావుపేట : పిట్టల అర్జున్

3) పాలేరు : తమ్మినేని వీరభద్రం

4) మధిర : పాలడుగు భాస్కర్

5) వైరా : భూక్యా వీరభద్రం

6) ఖమ్మం : ఎర్ర శ్రీకాంత్

7) సత్తుపల్లి : మాచర్ల భారతి

8) మిర్యాలగూడ : జూలకంటి రంగారెడ్డి

9) నకిరేకల్ : బొజ్జ చిన్న వెంకులు

10) భువనగిరి : కొండండుగు నర్సింహ

11) జనగాం : మోకు కనకా రెడ్డి

12) ఇబ్రహీంపట్నం : పగడాల యాదయ్య

13) పటాన్​చెరు : జే.మల్లికార్జున్

14) ముషీరాబాద్ : ఎమ్. దశరథ్

కాంగ్రెస్​తో పొత్తు లేదు, రెండు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాం : తమ్మినేని

"మరో 3 స్థానాలకు అభ్యర్థులను సాయంత్రం ప్రకటిస్తాం. సీపీఐ నేతలు శనివారం మా పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ నేతలు తెలిపారు. మూడు నినాదాలతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. బీజేపీని ఓడించగల పార్టీకి కొన్ని స్థానాల్లో మద్దతిస్తాం. సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం పోటీ చేయదు."- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

CPM Contests 14 Constituencies in Telangana : ఈ సందర్భంగా పొత్తు విషయంలో కాంగ్రెస్​ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని తమ్మినేని వీరభద్రం(tammineni Veera Bhadram on Congress Alliance) పేర్కొన్నారు. సీపీఐ నాయకులతో శనివారం తమ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యామని అన్నారు. వారు కాంగ్రెస్​తో కలిసి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. కొన్ని స్థానాల్లో బీజేపీని ఓడించ గల పార్టీలు ఏవైనా సరే వాటికి మద్ధతు ఇస్తున్నామని అన్నారు. వామపక్షాల ఐక్యతలో భాగంగా సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం పోటీ చెయ్యదని వెల్లడించారు. తమ అభ్యర్థులను, మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు ఆమోదించాలని కోరారు. శాసనసభ ఎన్నికల్లో మూడు నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించకున్నామని తమ్మినేని చెప్పారు. అవేంటంటే..

  • అసెంబ్లీకి సీపీఎం అభ్యర్థులను పంపించడం
  • సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను బలపర్చండి
  • బీజేపీ మతోన్మాధాన్ని అడ్డుకోవడం

Congress Left Parties Alliance Telangana : వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క

Congress and CPM Alliance in Telangana : కాంగ్రెస్​, సీపీఎం పొత్తు.. సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే భేటీ

CPI and CPM on Alliance with BRS : 'కలిస్తే సరి.. కలవకపోతే మరో దారి'

Last Updated : Nov 5, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.