హైదరాబాద్లోని అంబర్పేట్ విద్యుత్ స్మశానవాటికని తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ స్మశానవాటికను తిరిగి ప్రారంభించి సుమారు 50వేల మంది ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని సీపీఎం నేత మహేందర్ అన్నారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి కుళ్లిన మృతదేహాలను రాత్రిపూట దహనం చేయడం వల్ల దాని నుంచి వచ్చే వాయువులను పీల్చిన ప్రజలు క్యాన్సర్, కాలేయ, శ్యాస సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు.
గతంలో ఇదే స్మశాన వాటిక మూతపడటానికి అనేక పోరాటాలు చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ గవర్నర్ తివారీకి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిని అడ్డుకొని రాస్తారోకో చేశామన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కరోనా వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలను రాత్రి పూట దహనం చేస్తున్నారని... చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వెల్లడించారు.
అంబర్పేట స్మశానవాటికను మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కబీర్, ఎంఐఎం నాయకులు అలీ, రమేష్, రాజు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అంతరిక్ష రంగాన్ని సైతం ప్రైవేటీకరించడం ప్రమాదకరం: సీపీఐ