ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఎం నేత బీవీ రాఘవులు తప్పుబట్టారు. ఏపీలోని ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పటం సరికాదని అభిప్రాయపడ్డారు. కార్మికులను చర్చలకు పిలవాలని, వాళ్ల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం మాట్లాడుతున్న విధానానికి పోలికే లేదని విమర్శించారు.
ఇదీ చూడండి: కార్మికులారా.... తొందర పడకండి: జగ్గారెడ్డి