ETV Bharat / state

కొవిడ్​ పరీక్షలు, ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలి: సీపీఎం - సీపీఎం ఆధ్వర్యంలో కరోనా పరీక్ష కేంద్రాల సందర్శన

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని సీపీఎం సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి అజయ్ బాబు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు స్థానికంగా ఉన్న పలు ప్రభుత్వ కొవిడ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

cpi visit govt covid test centers in secunderabad region
కొవిడ్​ పరీక్షలు, ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలి: సీపీఎం
author img

By

Published : Aug 21, 2020, 8:55 AM IST

ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి అజయ్ బాబు ఆరోపించారు. అఖిలపక్షం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు స్థానికంగా ఉన్న పలు ప్రభుత్వ కొవిడ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు.

ప్రతి షాపు వద్ద శానిటైజర్​ ఏర్పాటు చేయాలని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందరికి శానిటైజర్లు అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అతిపెద్ద మురికివాడగా పేరున్న అడ్డగుట్టలో అతి స్వల్పంగా పరీక్షలు చేయడం, పాజిటివ్​ వచ్చిని వారిని తమ చిన్న గదుల్లోనే ఉండమని చెప్పడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోని కరోనా పరీక్షలు, ఐసోలేషన్ కేంద్రాలు పెంచాలని, వైరస్​ బాధితులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: ఆగని వాన.. ఉమ్మడి వరంగల్​ జలమయం!​

For All Latest Updates

TAGGED:

cpi protest
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.