రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. గోనె సంచులు, హమాలీల కొరతతో ధాన్యం కొనుగోలు వేగంగా జరగడం లేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పది లక్షలు పరిహారం చెల్లించాలి
పిడుగుపాటుకు గురై మరణించిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం నలుగురు మృత్యువాత పడగా.. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తండ్రి, కొడుకులపై పిడుగుపడి మృతి చెందారని తెలిపారు.