ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టాలి: చాడ - చాడ వెంకటరెడ్డి తాజా వార్తలు

కొవిడ్​ చికిత్స కోసం రోగుల నుంచి కార్పొరేట్​ ఆస్పత్రి యాజమాన్యాలు భారీగా వసూలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. రోగుల నుంచి డబ్బులు పిండుతున్న ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు.

ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టాలి: చాడ

author img

By

Published : Jul 31, 2020, 2:26 PM IST

కొవిడ్​ రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన న్యాయవాది హరీశ్​ రెడ్డి... ఆయన కుటుంబ సభ్యులు కొవిడ్​తో కొద్ది రోజుల్లోనే మృతిచెందినప్పటికీ వారి నుంచి 33లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా పెట్టి... అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఉస్మానియా ఆస్పత్రిలో నాలుగు నెలలుగా వేతనాలు అందక అవుట్​సోర్సింగ్​ నర్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని... వారి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.

ఇదీ చూడండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.