సైన్యం త్యాగాలను మోదీ ఉపయోగించుకుంటున్నారు: సీపీఐ లోకసభ ఎన్నికల ప్రచారంలో భాజపా జాతీయ భద్రతనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ముగ్దూం భవన్లో ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అధిగమించేందుకు.... సైన్యం త్యాగాలను మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు, రైతులకు కనీస మద్దతు ధర అంశాలను ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చామని సురవరం తెలిపారు. కార్మికులకు కనీస వేతనం, పంచాయతీ రాజ్ వ్యవస్థలో 50శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. త్రివిధ దళాల త్యాగాలతో దేశం ఎంతో సురక్షితంగా ఉందని సురవరం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా పాల్గొన్నారు.
ఇవీచూడండి:ఫికర్ చేయకుండ్రి... మీ పంటలు ఎండనియ్యా...!