భారీ వర్షాల్లో నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాలని.. వారికి నష్ట పరిహారం చెల్లించాలని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా ఆరోపించారు.
మూసీ పరిహాక ప్రాంతాల్లో అనేకమంది కట్టుబట్టలతో కుటుంబాలతో సహా రోడ్డుపాలయ్యారని.. వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. చెరువుల్లో 28వేల అక్రమ కట్టడాలు నిర్మించినప్ప టికీ ప్రభుత్వం వాటిని నిర్మూలించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా భవిష్యత్‌లో వరదలు వస్తే తట్టుకునేలా రక్షణ గోడ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. బర్త్‌డేకి పిలిచి అత్యాచారం..