ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియట్ బోర్డు వైఖరి కారణంగా... రాష్ట్రంలో తొమ్మిది వేల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా తొమ్మిది వేల మంది విద్యార్థులకు ర్యాంకులు నిలిపివేశారని మండిపడ్డారు.
ఈ సమయంలో విద్యార్థులు ఆందోళన చెంది... ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారుల తప్పిదాలకు... మీ అమూల్యమైన జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... ఈ ఘటనపై విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఉపకారవేతనాల కోసం కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తుల ఆహ్వానం