CPI Narayana on Alliance with Congress in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరిందని.. సీట్ల అవగాహన ఇంకా కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పష్టం చేశారు. తాము ఏ సీట్లు కావాలి.. అభ్యర్థులు ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెప్పామని అన్నారు. సీపీఐ, సీపీఎం చెరో ఐదు సీట్లు చొప్పున ప్రతిపాదన(Congress Alliance) పెట్టామని వివరించారు. కాంగ్రెస్ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల వేళ(Telangana Assembly Election 2023) పొత్తులు అనేవి ఎప్పుడు ప్రసవ వేదన లాంటివేనని నారాయణ అన్నారు. చర్చలు కొలిక్కి వచ్చాక తామే ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పొత్తు, సీట్లపై ఊహాగానాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 14 చోట్ల సీపీఐ పోటీ చేస్తోందన్నారు. సీపీఐ, సీపీఎం కలిసి వామపక్షాలు మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో సీపీఐ 15 స్థానాల్లోనూ, సీపీఎం 14 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయని తెలిపారు. అలాగే రాజస్థాన్‌లో సైతం సీపీఐ 14 స్థానాల్లోనూ, సీపీఎం 15 స్థానాల్లోనూ పోటీ చేయనుందన్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీలు.. అధికారులను బదిలీ చేసుకున్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.
"తెలంగాణలో మా ప్రతిపాదన పెట్టాం. మేము ఐదు సీట్లు.. సీపీఎం ఐదు సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమయ్యాము. అందుకు సంబంధించిన లిస్ట్‌ను మా వాళ్లు వారికి ఇచ్చారు. అందుకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతున్నారు. ఇందులో సెంట్రల్ వాళ్లు కూడా జోక్యం చేసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడ మాట్లాడాము. రాజా, నేను, అజీజ్ బాషా కలిసి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో చర్చించాము. ఇక్కడ కూడా సీపీఎంతో వేరేగా సీపీఐతో వేరేగా చర్చలు జరిపారు. వాస్తవానికి సీపీఐ, సీపీఎం సీట్లకు తగువు లేదు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చర్చలు జరుపుతుంది." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
CPI Narayana About Alliance with Congress Tickets: అలాగే ఎన్నికలకు ముందు పథకాలను ప్రవేశపెట్టడం అనేది ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని నారాయణ అన్నారు. ఈ విధానాన్ని ఆరు నెలల ముందు నుంచే అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తంలో ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాం.. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి పొత్తు కుదిరిన చోట అనుకూలంగా ఉంటాం.. లేకపోతే తమకు తామే పోటీ చేస్తామని సీపీఐ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ బాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CPI Narayana Reaction on Alliance : 'వామపక్షాలకి చెరో రెండు సీట్లు.. అది ప్రచారం మాత్రమే'