హైదరాబాద్‌లోని మురికి వాడల ప్రజలకు రక్షణ కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. బేగంపేట్, ప్రకాశ్‌నగర్, వడ్డెరబస్తీ మురికి వాడల ప్రజలకు బిల్డర్‌ల నుంచి రక్షణ కల్పించి... బీటలు వారిన ఇళ్లకు మరమ్మతులు చేయాలని కోరారు. కూల్చివేసిన కమ్యూనిటీ టాయిలెట్స్ వెంటనే నిర్మించి... అక్రమంగా అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని... లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఎన్డీసీ ఇంఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తమ అపార్టుమెంట్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు కమ్యూనిటీ టాయిలెట్స్‌ను కూల్చివేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఆరోపించారు. పునాది తవ్వడం కోసం పెద్ద రాతి గుండ్లను మందుగుండు సామగ్రితో బ్లాస్టింగ్ చేయడం వల్ల పక్కనే ఉన్న మురికివాడ ప్రజల ఇళ్లు బీటలువారి దెబ్బతిన్నాయని తెలిపారు.
ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు ఆపి.. కమ్యూనిటీ టాయిలెట్లను పునర్నించాలన్నారు. బీటలు వారిన ఇళ్ల ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని అజీజ్ పాషా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'రాజ్యసభకే అవమానకరమైన రోజు ఇది'