cpi kunamneni letter to kcr: పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం కూలీ రేట్లు పెంచాలని కేసీఆర్కు రాసిన లేఖలో కూనంనేని పేర్కొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు హమాలీలకు రేట్లు పెంచుటకు పౌరసరఫరాల శాఖ అంగీకరించడం జరిగిందన్నారు. ఒప్పందం ప్రకారం 2022 జనవరి ఒకటి నుంచి కొత్త రేట్లు అమలు కావాల్సి ఉందన్నారు.
జీవో విడుదల చేస్తామని సివిల్ సప్లయ్స్ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నేటికీ జీవో విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో హమాలీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చారన్నారు. కార్మికులు సమ్మె చేయడం వలన ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎగుమతి, దిగుమతులకు, రేషన్ కార్డు వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. అందువల్ల హమాలీ కార్మికుల కూలీ రేట్లు ఒప్పందం ప్రకారం పెంచేందుకు జీవో జారీచేయాలని కోరారు.
ఇవీ చదవండి :