జీహెచ్ఎంసీ ఎన్నికల మొదటి జాబితాను సీపీఐ, సీపీఎం నాయకులు ప్రకటించారు. హైదరాబాద్ హిమయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 150 సీట్లకు గాను 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు... మొదటి విడతగా 11 మంది పేర్లు ప్రకటించినట్లు తెలిపారు. మిగితా వారి పేర్లను రేపు ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మత రాజకీయాలు చేస్తున్న తెరాస, భాజపా, మజ్లీస్ పార్టీలను ఓడించి... ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోన్న సీపీఐ, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీపీఐ:
- హిమాయత్ నగర్- బి. ఛాయా దేవి
- షేక్పేట్- షైక్ శంశుద్దీన్ అహ్మద్
- తార్నాక- ఏ. పద్మ
- లలిత బాగ్- మొహమ్మద్ అరీఫ్ ఖాన్
- ఓల్డ్ మలక్పేట్- ఫిర్ దోస్ ఫాతిమా
- ఉప్పుగూడా- సయ్యద్ అలీ
సీపీఎం:
- చర్లపల్లి- పి. వెంకట్
- జంగంపేట్- ఏ. కృష్ణ
- బాగ్ అంబర్పేట్- ఎం. వరలక్ష్మి
- రాంనగర్- ఎం. దశరథ్
- అడ్డగుట్ట- టి. స్వప్న
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు.. కొద్దిసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన