నాలుగు స్థానాల్లో పోటీకి నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఉభయ కమ్యూనిస్టులు... అన్ని సీట్లకూ పోటీ చేయకుండా తమకు బలమున్న నాలుగు స్థానాల్లో బరిలో నిలవాలని నిర్ణయించాయి. ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు దీనిపై చర్చించారు. నల్గొండ, ఖమ్మం స్థానాల్లో సీపీఎం, మహబూబాబాద్, భువనగిరి స్థానాల్లో సీపీఐ రంగంలోకి దిగాలని సూత్రపాయంగా అంగీకారానికి వచ్చాయి.
అభ్యర్థులపై రెండ్రోజుల్లో స్పష్టత
నేడు జరిగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత రానుంది.ఈ నాలుగు స్థానాల్లో మినహా మిగిలిన సీట్లలో జనసేన, తెజస, బీఎల్‌ఎఫ్, ఎంబీటీ, ఎంసీపీఐతో కలిసి పనిచేయాలనే యోచనలో రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు.
శాసనసభ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోల్పోయిన కమ్యూనిస్టు పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లోనైనా ప్రజలు ఆదరిస్తారో లేదో వేచి చూడాలి.