కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేశారనడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నిజంగా ట్యాపింగ్ జరిగితే దానిపై చర్య తీసుకునే అధికారం కేంద్రానికే ఉందన్నారు.
సన్నవరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే, కేంద్రం మోకాలడ్డు పెట్టడం రాజకీయమే అవుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రానికి సహకరిస్తూ క్వింటాల్‌కు రూ.2500 ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల సన్న, చిన్నకారు రైతులకు ఉపశమనం కలుగుతుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు.