జమ్ముకశ్మీర్లో ముష్కరుల చేతిలో వీర మరణం పొందిన సైనికులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన మహేశ్ త్యాగం మరువలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుడు అని కొనియాడారు.
ఇదీ చదవండి: వీరజవాన్ మహేశ్ మృతిపై నేతల సంతాపం