ETV Bharat / state

రేపటి గ్రేటర్​ పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: సీపీ సజ్జనార్​ - GHMC Election Polling

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేసినట్లు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

cp sajjanar
రేపటి గ్రేటర్​ పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: సీపీ సజ్జనార్​
author img

By

Published : Nov 30, 2020, 3:13 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. బల్దియా పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 వేల 500 మంది సివిల్, 3 వేల మంది ఏఆర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 32 డివిజన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,437 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

రేపటి గ్రేటర్​ పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: సీపీ సజ్జనార్​

సైబరాబాద్ పరిధిలో 766 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమని స్పష్టం చేశారు. 250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని తెలిపారు. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. సైబరాబాద్‌లో 15 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 73 పికెట్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 587 ఆయుధాలను డిపాజిట్ చేశారని ప్రకటించారు. 369 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని వివరించారు. రూ.15 లక్షల విలువైన 396 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్‌కు ప్రత్యేక వాహనం అనుమతి ఉండదని ప్రకటించారు. ఓటర్లను తరలించడం చట్టవిరుద్ధం.. అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.