రాబోయే 10 రోజుల పాటు ప్రజలు ఇంటి వద్దనే ఉంటూ లాక్డౌన్కు సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో.. కూకట్‌పల్లి జేఎన్టీయూ వద్ద లాక్డౌన్ అమలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకొని ప్రజలంతా మధ్యాహ్నం 2 గంటల లోపే ఇళ్లకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు. సరైన అనుమతులు లేకుండా బయటకు రాకూడదని సూచించారు. అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పెట్రోల్ బంకులు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారు స్లాట్ బుకింగ్ కన్ఫర్మేషన్ చూపిస్తేనే అనుమతిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Live video: డబ్బుల కోసం భార్యతో గొడవ... విద్యుత్ వైర్లు పట్టుకొని భర్త మృతి