ETV Bharat / state

పోలీస్ సబ్సిడీ​ క్యాంటిన్ ప్రారంభించిన సీపీ సజ్జనార్​‌ - సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సబ్సిడీ క్యాంటిన్‌

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సబ్సిడీ క్యాంటిన్‌ అందుబాటులోకి వచ్చింది. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ అవసరాల కోసం నిత్యావసరాలు తక్కువ ధరకు లభించే క్యాంటిన్​ను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ప్రారంభించారు.

cp sajjanar inaugurate police subsidy canteen at cyberabad police commiserate
పోలీస్ సబ్సిడీ​ క్యాంటిన్ ప్రారంభించిన సీపీ సజ్జనార్​‌
author img

By

Published : Jun 12, 2020, 6:33 PM IST

కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్​ కమిషనర్​ సజ్జానార్‌ సూచించారు. సైబరాబాద్​ కమిషనరేట్‌ ఆవరణలో సబ్సిడీ క్యాంటిన్‌ను సీపీ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ అవసరాల కోసం ప్రారంభించిన ఈ క్యాంటిన్​లో నిత్యావసరాలు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు.

అనంతరం కమిషనరేట్​ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, నేర విభాగం డీసీపీ రోహిణి, డీసీపీ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.