రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీఆర్సీలను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. నేరెడ్‌మెట్‌లోని భవన్స్ కళాశాలలో ఉన్న డీఆర్సీ వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తీసుకెళ్లే బ్యాలెట్ పత్రాలు, బాక్సులకు సరైన భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మహేశ్ భగవత్ ఆదేశించారు.
ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు