ETV Bharat / state

48 గంటల వరకు విజయోత్సవాలకు అనుమతి లేదు: అంజనీ కుమార్ - హైదరాబాద్ తాజా వార్తలు

దోమలగూడలోని లెక్కింపు కేంద్రాన్ని సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

cp anjani kumar Supervising ghmc polling counting centres at domalguda and nizam college
ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ: సీపీ అంజనీ కుమార్
author img

By

Published : Dec 4, 2020, 9:43 AM IST

దోమలగూడలోని ఏవీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచే లెక్కింపు కేంద్రాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పటిష్ఠ బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని ఆయన పేర్కొన్నారు.

లెక్కింపు పూర్తయ్యాక 48 గంటల్లోపు ఎలాంటి విజయోత్సవాలు జరుపుకోకూడదని ఆయన హెచ్చరించారు. 48 గంటల తర్వాత అనుమతులు తీసుకోవాలని సూచించారు. పటిష్ఠ ఏర్పాట్లపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. నిజాం కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్నీ ఆయన తనిఖీ చేశారు.

ఇదీ చదవండి: మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తైతే.. సాయంత్రానికి ఫలితాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.