రాష్ట్రంలో నిత్యం రెండు లక్షల మందికి పైగా టీకాలు అందిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా గడచిన 24 గంటల్లో 2,45,098 మందికి టీకాలు అందించారు. అందులో 2,17,789 మందికి తొలి డోస్ కాగా... మరో 27,309 మందికి రెండో డోస్ టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 88,47,880 మందికి తొలి డోస్ పూర్తి కాగా... మరో 14,76,440 మందికి రెండో డోస్ టీకాలు అందించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం టీకా వృద్ధి కేవలం 0.11 శాతం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటీ 3 లక్షల 24వేల 320 డోసుల టీకాలు పంపిణీ చేయగా... అందులో 83 లక్షల 36 వేల 315 డోసులు ప్రభుత్వ కేంద్రాల్లోనూ... మరో 19 లక్షల 88 వేల 5 డోసులు ప్రైవేటులోనూ అందించారు.
ఇదీ చూడండి: మరియమ్మ కేసులో చౌటుప్పల్ ఏసీపీపై వేటు