Doctor Sridhar on Omicron Variant: డెల్టా వేరియంట్ విధ్వంసం ముగిసిపోయిందో లేదో... అప్పుడే ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే 55కి దేశాల్లో ఉనికి చాటుకుంది ఈ వేరియంట్. డెల్టా కన్నా ఇది ప్రమాదకరమా అన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. రోగనిరోధక శక్తినీ తప్పించుకుని వ్యాప్తి చెందుతోందన్న వార్తలు... ఇంకా గుబులు పెంచుతున్నాయి. పైగా... డిసెంబర్ చివరి నాటికి కేసులు పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే... పరిశోధకులూ ఒమిక్రాన్ వ్యాప్తిపై అధ్యయనాలు చేస్తున్నారు. వారిలో... న్యూయార్క్‌లోని బ్రాంక్స్ కేర్ హాస్పిటల్ సెంటర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ ఛైర్మన్, కొవిడ్-19 పరిశోధకులు డాక్టర్ శ్రీధర్ చిలిమూరి కూడా ఉన్నారు. ఒమిక్రాన్, డెల్టా మ్యుటేషన్లు ఒకేలా ఉన్నాయన్నది ఆయన ప్రాథమికంగా నిర్ధరించిన విషయం. ఈ వేరియంట్ ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశముందనీ అంటున్నారు. ఒమిక్రాన్‌కు సంబంధించి మరెన్నో వివరాలను ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు..డాక్టర్ శ్రీధర్.
ఇవీ చూడండి: