ETV Bharat / state

రాత్రిపూట కొవిడ్‌ మృతుల కుటుంబాలకు అగచాట్లు - తెలంగాణలో కొవిడ్​ మృతుల కష్టాలు

ఇంటిమనిషి దూరమైన బాధలో ఉన్న కుటుంబాలను ప్రైవేటు ఆసుపత్రులు, దళారుల దోపిడీ మరింత కుంగదీస్తోంది. రాత్రిపూట ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు మరణిస్తే అటు ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని తీసుకెళ్లమని ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సమయానికి శ్మశానాలకు కూడా తరలించలేని పరిస్థితి ఉండటంతో శవాగారాలు, ఫ్రీజర్ల కోసం కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు.

తెలుగు వార్తలు
తెలంగాణ కరోనా వార్తలు
author img

By

Published : Apr 26, 2021, 10:48 AM IST

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానానికి మృతదేహాలతో వచ్చిన అంబులెన్స్‌లు

కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు నగరంలోని శ్మశానవాటికల పని సమయం పెంచాలని శనివారం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపినా.. గ్రేటర్‌లోని శ్మశానాల్లో మాత్రం స్థానికంగా పరిస్థితి మారలేదు.

5 కి.మీ.లు.. రూ.82 వేలు!

ఓ ఐటీ ఉద్యోగి(45) కొవిడ్‌ బారిన పడి కేపీహెచ్‌బీలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఆక్సిజన్‌ స్థాయి పూర్తిగా పడిపోయి అతను మరణించాడు. అప్పటికే బాధలో ఉన్న కుటుంబం నుంచి అంత్యక్రియల కోసం అంబులెన్సు, దహనం అన్ని ఖర్చులు కలిపి ఆసుపత్రిలోని మధ్యవర్తులు రూ.82వేలు వసూలు చేశారు. కేపీహెచ్‌బీ రోడ్‌ నెం.1లో ఉన్న ఆసుపత్రి నుంచి 5కి.మీ.ల దూరంలో ఉన్న హైటెక్‌సిటీ ఆర్‌యూబీ శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే ఆసుపత్రి దోపిడీపై గతంలోనూ పలువురు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులిచ్చినా యంత్రాంగం కదలకపోవడంపై వారంతా మండిపడుతున్నారు.

శ్మశానాలకు గడువు సమయమేం లేదు

ప్రస్తుతం అన్ని శ్మశానవాటికలూ అన్ని వసతులతో పనిచేస్తున్నాయి. దేనికీ గడువు సమయం ఏమీ లేదు. గత మూడురోజులుగా రాత్రి 11గంటల వరకూ కొనసాగినవీ ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, టిమ్స్‌లాంటి ప్రభుత్వాసుపత్రుల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. కావాల్సినవారు సంప్రదిస్తే సాయం చేస్తారు. అంత్యక్రియలు, ఇతర సేవల కోసం జీహెచ్‌ఎంసీ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలి.

- లోకేష్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

ఇదీ చూడండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.