Pudding Pub case: రాజధాని నగరంలో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నిందితులను 4 రోజుల కస్టడీకి ఇస్తూ నాంప్లలి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపట్నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో ఇప్పటికే పబ్ యజమాని, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అర్ధరాత్రి పబ్‌పై పోలీసులు దాడులు జరిపిన సమయంలో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖుల వారసులు సైతం పట్టుబడ్డారు. ఇప్పటికే పోలీసులు వీరిద్దరి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో పబ్ యజమాని అభిషేఖ్, మేనేజర్ అనిల్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. పుడింగ్ పబ్‌లో కొకైన్ లభించడంతో పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు.
పబ్ లైసెన్స్ రద్దు: టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డ రాడిసన్ బ్లూ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేశారు. పబ్‌లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న ఘటనపై అబ్కారీ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పబ్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఆ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి: Radisson Pub Case: అభిషేక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తింపు