ETV Bharat / state

క్వారంటైన్​ కాలనీకీ నేనున్నానంటోన్న కార్పొరేటర్​ - తెలంగాణలో కరోనా కేసులు

కరోనా పాజిటివ్​ రావటం వల్ల హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఓ కాలనీలోని 150 మంది కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్​ చేశారు. వారందరికీ నిత్యావసర సరుకులను క్వారంటైన్​ ఉన్నన్ని రోజులు అందిస్తానని హామీ ఇచ్చాడు ఆ కాలనీ కార్పొరేటర్​.

CORPORATOR GIVE ASSURANCE TO QUARANTINE COLONY PEOPLE
క్వారంటైన్​ కాలనీకీ నేనున్నానంటోన్న కార్పోరేటర్​
author img

By

Published : Apr 18, 2020, 9:50 PM IST

Updated : Apr 18, 2020, 10:22 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఖాజానగర్ కాలనీ క్వారంటైన్​ ప్రాంతంలో ఉన్న 150 కుటుంబాలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్​ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖాజానగర్​లో కరోనా పాజిటివ్ రావటం వల్ల బాధితుని నివాస పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్​​ ప్రాంతంగా ఏర్పాటు చేశారు.

కాలనీలోని 150 కుటుంబాలను హోం క్వారైంటైన్​లో ఉంచారు. వారందరికీ నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో వెంకటేశ్​​గౌడ్ అందజేశారు. కాలనీకి తాను అండగా ఉంటానని... క్వారంటైన్​ ఉన్నన్ని రోజులు నిత్యావసర వస్తువులు అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

Last Updated : Apr 18, 2020, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.