ETV Bharat / state

పిల్లలపై కరోనా పంజా.. యువత బయట తిరగడమే కారణం!

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌తో విద్యాలయాలు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. కానీ చిన్నారులు, యువతపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కొవిడ్​ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. యువత అలా చేయడం వల్ల కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు కరోనా బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

coronavirus effected on children
పిల్లలపై కరోనా పంజా.. యువత బయట తిరిగడమే కారణం!
author img

By

Published : Aug 16, 2020, 7:16 AM IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. పిల్లలపైనా కరోనా పంజా విసురుతోంది. శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 90,259కు చేరుకుంది. నిబంధనలు మరింత సడలించిన తరువాత రోడ్లపైకి ఎక్కువగా రావడంతో యువత వైరస్‌బారిన పడుతోంది. ఈనెలలో 20 ఏళ్లలోపు వారిలో పాజిటివ్‌ కేసులు పెరిగాయి. జూలై నెలాఖరు నాటికి 11-20 ఏళ్లలోపు పిల్లలు, యువతలో పాజిటివ్‌ రేటు 5.3 శాతం ఉంటే.. ఈనెలలో ఇప్పటికే 6.3 శాతానికి పెరిగింది. పురుషుల్లో స్వల్పంగా పాజిటివ్‌ రేటు తక్కువైతే 50 ఏళ్లలోపు మహిళల్లో కొంత పెరుగుతోంది. యువత స్వేచ్ఛగా బయట తిరిగి వైరస్‌ తీసుకువస్తుండటం వల్ల కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు కరోనా బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

కొత్త కేసుల వివరాలివి..

రాష్ట్రంలో శుక్రవారం 1,863 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో 394, మేడ్చల్‌ 175, రంగారెడ్డి 131, కరీంనగర్‌ 104, వరంగల్‌ అర్బన్‌ 101, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81 కేసులు వచ్చాయి. మరో పది మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 684కి చేరింది. 1,912 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 73.34 శాతానికి చేరింది. 23,379 మంది చికిత్స పొందుతున్నారు.

14 రోజుల్లో.. 28.22 శాతం కేసులు

ఈనెల 14 రోజుల్లోనే 25,473 కేసులు (28.22 శాతం) వచ్చాయి. గతనెలలో సగటున గంటకు 60 కేసులు ఉంటే... ఇప్పుడు 75కి పెరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కొన్ని సర్కారు ఆస్పత్రుల్లో పడకల కొరత...

కొన్ని సర్కారు ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోంది. వరంగల్‌లోని ఎంజీఎం, సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి, కొత్తగూడెం, గద్వాల జిల్లా ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి. గాంధీలో 500 ఐసీయూ పడకలు ఉంటే, ఇప్పటికే 423 రోగులతో నిండిపోయాయి. జీహెచ్‌ఎంసీలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 5,579 ప్రైవేటు పడకలు ఉంటే అందులో 3,335 నిండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 7,862 పడకల్లో 5,150 ఖాళీగా ఉన్నాయి.

ఇదీ చూడండి: 'కొవిడ్​ వ్యాక్సిన్​ హైదరాబాద్​ నుంచి త్వరలోనే వ్యాక్సిన్​...!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.