ETV Bharat / state

కరోనా పరీక్ష కిట్ల కొరత.. ఫలితాలపై అస్పష్టత - హైదరాబాద్ కరోనా వార్తలు

కరోనా పరీక్షల నిర్ధారణపై స్పష్టత కరవవుతోంది. పరీక్ష చేయించుకున్న రోజు కరోనా పాజిటివ్‌ అని చెప్పి ఆ తరవాత తీరిగ్గా నెగిటివ్‌ అని చెబుతున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందులో ఏది నిజమో తేల్చుకోలేక ఆందోళనకు లోనవుతున్నారు.

CORONAVIRUS
CORONAVIRUS
author img

By

Published : Jul 26, 2020, 6:18 AM IST

ఓవైపు కరోనా పరీక్షల కిట్ల కొరత, మరోవైపు నిర్ధారణలో అస్పష్టమైన ఫలితాల వల్ల హైదరాబాద్‌లో కరోనా అనుమానితులు, బాధితులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చర్యలతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. నగరంలో కరోనా కిట్లు లేకపోవడంతో పలు ప్రాథమిక/అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిలిచిపోయాయి.

మరికొన్ని చోట్ల పరీక్షల సంఖ్యను తగ్గించేశారు. పరీక్ష చేయించుకున్న రోజు కరోనా పాజిటివ్‌ అని చెప్పి మందుల సామగ్రి ఇచ్చేసిన అధికారులు ఆ తరవాత తీరిగ్గా నెగిటివ్‌ అని చెబుతుండడం బాధితులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది.

కిట్లు దాదాపుగా అయిపోవడంతో...

నగరంలో గత కొద్ది రోజులుగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షతోపాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు మొదలుపెట్టడంతో వేలాది మంది కరోనా పరీక్షలు చేయించుకోగలిగారు. యాంటీజెన్‌ విధానంలో అదే రోజూ ఫలితాన్ని తెలుసుకొనే వీలుపడింది. ఈనెల 8 నుంచి నగరంలో 40 వేల పరీక్షలు చేయగా అందులో 7,900 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. శనివారం 3,787 మందిని పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న యాంటీజెన్‌ కిట్లు దాదాపుగా అయిపోవడంతో పరీక్షల సంఖ్య తగ్గించేశారు.

ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తగ్గాయ్

కొన్ని ప్రాథమిక/పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏకంగా ప్రక్రియనే నిలిపివేశారు. 200 పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ప్రస్తుతం 50 పైన మాత్రమే చేయగలుగుతున్నారు. అనుమానిత లక్షణాలతో వందల మంది వచ్చి తిరిగివెళుతున్నారు. నిలిపివేసిన కేంద్రాలకు ఒకట్రెండు రోజుల్లో కిట్లు వస్తాయని అప్పుడు మళ్లీ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలకు వెళదామంటే వాటిని బాగా తగ్గించేశారు. నిమ్స్‌లాంటి చోట్ల చేస్తున్నా సామాన్యులకు అవకాశం లేకుండాపోయింది.

ఆయా ఆరోగ్య కేంద్రాల్లో ఇదీ పరిస్థితి

  • వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో రోజూ 250 మందిని పరిశీలించేవారు. గత సోమవారం నుంచి ఆ సంఖ్య తగ్గింది. శుక్రవారం నుంచి పూర్తిగా ఆగిపోయింది. రోజూ 200 మంది వచ్చి నిరసన తెలిపి వెళ్లిపోతున్నారు.
  • మన్సూరాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 200 పరీక్షలు చేసే వారు. ఇప్పుడు 25 మాత్రమే చేస్తున్నారు.
  • నాగోలు పోచమ్మ గుడి వద్ద కొన్ని రోజులు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఇప్పుడు నిలిపేశారు.
  • సరూర్‌నగర్‌ పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు లేక గురు, శుక్రవారాల్లో పరీక్షలు ఆగిపోయాయి. శనివారం తక్కువ సంఖ్యలో చేశారు.

గాడిన పడని ఫలితాల వెల్లడి వ్యవస్థ

కరోనా నిర్ధారణ ఫలితాలను వెల్లడించే వ్యవస్థ ఇప్పటికీ గాడినపడలేదు. పరీక్షల్లో ఒక ఫలితం వస్తే ఫోన్‌ ద్వారా మరో ఫలితం చెబుతుండడం గమనార్హం. ఎల్బీనగర్‌కు చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు పది రోజుల కిందట పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఫోన్‌లో తెలిపారు.

ముగ్గురికి హోం ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చారు. వైద్యుల సూచనల మేరకు వారు మందుల కోర్సు వాడారు. శనివారం వారి చరవాణికి నెగిటివ్‌ అని సందేశం వచ్చింది. మందులన్నీ వాడిన ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. దాదాపు 300 మందికిపైగా ఇలాగే ముందు పాజిటివ్‌ తరవాత నెగిటివ్‌ సందేశం పంపడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.