ETV Bharat / state

హైదరాబాద్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ - హైదరాబాద్‌లో కరోనా వైరస్

రాష్ట్ర రాజధానిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీలోనివే. ప్రధానంగా జియాగూడ, మాదన్నపేటలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కంటైన్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ఇంటింటికి వైద్య సర్వే చేస్తున్నారు.

hyderabad
hyderabad
author img

By

Published : May 17, 2020, 6:59 PM IST

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరంలో ప్రధానంగా జియాగూడ, మాదన్నపేటలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పురానాపూల్‌లోని ఎస్బీఐకి కరోనా సోకిన వ్యక్తి వచ్చాడనే అనుమానంతో సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. బ్యాంక్‌లో పనిచేస్తున్న 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కంటైన్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వైద్య సర్వే చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట్‌లో నిన్న ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కరోనా నిర్ధరణ అయింది. అదే అపార్ట్‌మెంట్‌లోని మరో ఐదుగురిని పరీక్షలకు పంపారు. ఇంకా ఈ ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: 50రోజులు..9లక్షల చలాన్లు..ఆదాయం రూ.12కోట్లు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.