ETV Bharat / state

'కరోనా టీకా తీసుకున్నవారిలో 10 నెలలు వరకు యాంటీబాడీలు' - తెలంగాణ తాజా వార్తలు

రెండో దశలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోందని.. అయినా తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారి శాతం స్వల్పంగా ఉందని... ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని... టీకా తీసుకున్న వారిలో 10 నెలలపాటు యాంటీబాడీలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా రెండోదశ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టీకా ఆవశ్యకతపై శ్రీనివాసరావు ఈటీవీ-ఈటీవీ భారత్​ ద్వారా ప్రత్యేకంగా వివరించారు.

dh srinivasa rao
ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు
author img

By

Published : Apr 2, 2021, 5:30 AM IST

'కరోనా టీకా తీసుకున్నవారిలో 10 నెలలు వరకు యాంటీబాడీలు'

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరగడం... రెండోదశకు సూచిక అని ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌రావు అభిప్రాయపడ్డారు. మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడం వల్ల... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈటీవీ-ఈటీవీ భారత్​ ద్వారా ప్రజలతో నేరుగా ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా మాట్లాడారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు..

రాష్ట్రంలో రోజు 50వేలకుపైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా చిన్నారులే మహమ్మారి బారినపడుతున్నారని.. వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా... పిల్లల నుంచి పెద్దలకు సోకే ప్రమాదం ఉందన్నారు. రెండోదశలో 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని స్పష్టం చేశారు. వైరస్‌ వేగంగా వ్యాపించినా... తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారు తక్కువ శాతం ఉంటున్నారని పేర్కొన్నారు.

కొవిడ్​ నుంచి కోలుకున్నా..

మహమ్మారిని ఎదుర్కొనేందుకు అర్హులైన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయన్న డీహెచ్​... టీకా తీసుకున్నవారు వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్నవారిలో దాదాపు 10 నెలలు వరకూ యాంటీబాడీలు ఉంటాయని స్పష్టం చేశారు. రక్తం గడ్డ కట్టకుండా మందులు వాడేవారు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు... వైద్యుడి సలహా మేరకు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రెండు డోస్‌లు ఒకే కేంద్రంలో తీసుకోవాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్‌ చెప్పారు.

ఇవీచూడండి: కేసుల పెరుగుదల సెకండ్ వేవ్‌కు ప్రారంభ సూచిక: శ్రీనివాసరావు‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.