కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కూకట్‌పల్లి న్యాయస్థానం ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు, సిబ్బందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.
హైకోర్ట్ ఆదేశాల మేరకు, అత్యవసర కేసులలో మాత్రమే కోర్టుకు రావాలని, బెయిల్, ఔట్ స్టాండింగ్ ఆర్డర్స్, ఇంజంక్షన్స్ వంటి అత్యవసర కేసులకు మాత్రమే న్యాయస్థానానికి హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసు వివరాలను తెలుసుకునేందుకు కోర్టు ప్రాంగణంలో డైలీ కేస్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోర్టుకు హాజరయ్యే వారికి కోర్టు ప్రాంగణంలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులోకి అనుమతిస్తామని అన్నారు.
ఇదీ చదవండి:కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి!