ETV Bharat / state

హైదరాబాద్​లో కరోనా విజృంభణపై కేంద్ర బృందం ఆందోళన - భాగ్యనగరంపై కరోనా పంజా

జంటనగరాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపుగా రెండు వందల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్​-19 లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తుండటంతో ఈ సంఖ్య ఆ మేరకు ఉంటోందని, పెద్దసంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తే... వేల సంఖ్యలో కొత్త కేసులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తొలగించటం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం స్పష్టం చేసింది. తెలంగాణలోని పరిస్థితిపై కేంద్ర అధికారులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Hyderabad corona cases latest news
Hyderabad corona cases latest news
author img

By

Published : Jun 10, 2020, 10:57 PM IST

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభమైంది. తెలంగాణలో నానాటికీ పెరుగుతోన్న కొత్త కేసుల సంఖ్యపై కేంద్ర అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప‌రిస్థితి ఇలాగే కొనసాగితే... జులై నెల‌ఖారు నాటికి ప‌రిస్థితి ప్రమాదకరంగా మారుతుంద‌ని వారు రాష్ట్ర ఉన్నతాధికారులను హెచ్చరించారు.

పాజిటివ్ కేసుల సంఖ్యపై ఆరా...

దిల్లీ నుంచి వ‌చ్చిన కేంద్ర బృందం జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, క‌లెక్టర్​తో స‌మావేశమైంది. కరోనా కట్టడికి మ‌రింత ప‌క‌డ్బందిగా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. బల్దియా ప‌రిధిలో జోన్లు, స‌ర్కిళ్లు, వార్డులవారిగా నెల‌కొన్న ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య.... సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుస‌రిస్తున్న ప‌ద్ధతి, నిర్ధర‌ణ ప‌రిక్షలు నిర్వహించేందుకు ఉన్న స‌దుపాయాలు, ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌, హోం ఐసోలేష‌న్‌, కంటైన్‌మెంట్ అంశాల గురించి చ‌ర్చించారు.

ప్రజల స‌హ‌కారం చాలా కీలకం...

కరోనా వ్యాప్తిని నియంత్రణకు ప్రజల స‌హ‌కారం చాలా కీలకమ‌ని కేంద్ర సంయుక్త కార్యద‌ర్శి సంజ‌య్ జాజు అన్నారు. దిల్లీ, ముంబై, చెన్నైల‌లో ప్రైవేట్ ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల‌లో కూడా కరోనా ప‌రిక్షలు నిర్వహిస్తున్నందున... ప్రైవేట్‌గా నిర్వహించిన ప‌రిక్షల‌లోనే 70 శాతం పైబ‌డి పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల‌లో క‌రోనా నియంత్రిణకు హోం కంటైన్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమ‌ని పేర్కొన్నారు. రోజుకు 100 కేసుల‌కంటే ఎక్కువ‌గా నిర్ధర‌ణ అవుతున్నందున జీహెచ్‌ఎంసీ ప‌రిధిలోని నాలుగు జిల్లాల క‌లెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటి క‌మిష‌న‌ర్లతో వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటిక‌ప్పుడు స‌మాచారాన్నితీసుకుంటూ, స‌మ‌న్వయాన్ని పెంచాలని ఆయన కోరారు.

బల్దియా పరిధిలో బుధవారం కూడా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. సాక్షాత్తు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని, మేయర్‌ ఛాంబర్‌ను కొవిడ్​ కారణంగా అధికారులు ఇవాళ ఖాళీ చేపించారు. గ‌తంలో ఒక‌రికి పాజిటివ్ రాగా బుధవారం మేయర్ పేషీ​లో అటెండర్​కి కరోనా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మేయర్ కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. మేయర్​ పేషీలోని మిగితా ఉద్యోగులను ఇళ్లకు పంపారు. గ‌తంలో పాజిటివ్ వ‌చ్చిన హెల్త్ సెక్షన్​లోని మిగ‌తా 40 మంది ఉద్యోగులకి స‌రోజిని దేవి ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్షలు నిర్వహించారు.

ఇద్దరు ప్రొఫెసర్​లకు కరోనా పాజిటివ్​...

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ఇద్దరు ప్రొఫెసర్​లకు కరోనా పాజిటివ్​గా నిర్ధర‌ణ అయింది. ఓయూ టెక్నాలజీ కళాశాల ఉద్యోగి నిన్న గాంధీ ఆస్పత్రిలో క‌రోనా చికిత్స పొందుతూ మృతి చెందడం వల్ల... కళాశాలలో శానిటేషన్ చేశారు. ఆ కళాశాలలోని అధ్యాప‌కులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

కొవిడ్​-19తో ఆటోడ్రైవర్​ మృతి...

ఎర్రగడ్డ డివిజన్ రాజీవనగర్​లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్​లో 53 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. బోయిన్​ప‌ల్లి పోలీస్​ స్టేషన్​ ప‌రిధిలో ఓ ఆటో డ్రైవ‌ర్​కు క‌రోనా సోక‌డం వల్ల గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం మ‌ృతిచెందాడు.

అంబర్​పేటలో 11 పాజిటివ్​ కేసులు...

అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో బుధవారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్​లో కూరగాయలు అమ్మే వ్యక్తికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కాచిగూడలోని ఓ యువ‌తికి కరోనా సోకింది. అంబర్‌పేట్ భరత్ నగర్​లో ఓ వ్యక్తికి... గోల్నాకలోని శాంతినగర్​లో ఓ వృద్ధురాలకు పాజిటివ్ నిర్ధరణ అయింది. జిందాతిలిస్మాత్ రోడ్డు గోల్నాకలో ఓ మెకానిక్​కు క‌రోనా సోకిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

కాచిగూడలో మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయిన జగదీశ్​ కుటుంబ సభ్యులలో ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. అంబర్‌పేట్ పోలీస్​లైన్​లో ఇద్దరు ఏఎన్ఎంలకు పాజిటివ్​ నిర్ధరణ అయింది. అలాగే పటేల్ నగర్​లో ఓ ఏఎన్ఎం భార్యకి కొవిడ్​-19 సోకింది. ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.