ETV Bharat / state

భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న కరోనా - హైదరాబాద్​లో కరోనా విజృంభణ

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో... అగ్రభాగం జంట నగరాల పరిధిలోనివి కావడం వల్ల నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా ఏ మాత్రం కట్టడి కాకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 31, 2020, 8:16 PM IST

భాగ్యనగరంలో కరోనా వైరస్​ తీవత్ర రోజురోజుకు భారీగా విస్తరిస్తోంది. బల్దియా అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన నాటి నుంచి జనాలు భయట తిరగడం... దుకాణాలు, షాపింగ్​లకు వెళ్లడం వల్ల కేసులు భారీగా నమోదు అవుతున్నాయాని అధికారులు అంచనా వేస్తున్నారు.

బస్తీల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం వల్ల జీహెచ్​ఎంసీ అధికారులు వాటిపై దృష్టిసారించారు. బస్తీల్లో తిరుగుతూ ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక కంటైన్​మెంట్ జోన్లతో పాటు ఇతర ఏరియాల్లో రెండో విడత రసాయనాల పిచికారీ మొదలు పెట్టారు ఎంటమాలజీ అధికారులు. మరోవైపు డీఆర్​ఎఫ్ బృందాలు కూడా రసాయనాలను స్ప్రే చేస్తున్నాయి.

కానిస్టేబుల్​కు కరోనా...

ఆదివారం కూడా హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన రాంనగర్​లోని బట్టల దుకాణం యజమాని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లంగర్​హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళహాట్​లో ఓ కానిస్టేబుల్​తో పాటు... మరోకరు కరోనా భారిన పడ్డారు.

కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్​...

హైదర్​గూడలోని ముత్యాలబాగ్​లో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా సోకింది. అతని కుటుంబ సభ్యులకు లక్షణాలు ఉండడం వల్ల వారికి కూడా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఆ కూరగాయల వ్యాపారి దగ్గర ఎంతమంది కూరగాయలు కొన్నారనే విషయాలపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మల్లాపూర్ డివిజన్ ఎస్వీ నగర్​కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. గచ్చిబౌలి ఇంద్రానగర్​లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ముషీరాబాద్​లో ఒకరు మృతి...

ముషీరాబాద్ నియోజకవర్గంలో కొవిడ్​-19తో ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుని భార్యతో పాటు ఆయన కూతురికి కూడా కరోనా సోకింది. జెమిస్థాన్ పూర్ చేపల మార్కెట్ వద్ద నివసించే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కుటుంబంలోని పది మందిని హోం క్వారంటైన్ చేసినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. మేదర్ బస్తీలో ఇటీవల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రాగా ఆమెకు సంబంధించిన కుటుంబంలోనే పదహారేళ్ల అమ్మాయి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే బస్తీలోని ఓ హోటల్​లో పనిచేసే కార్మికుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన నలుగురికి పరీక్షలు నిర్వహించారు. శనివారం 16 మందికి నిర్వహించిన పరీక్షల్లో 9 పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకో రెండు రిపోర్ట్స్ అందాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అంబర్ పేట్ పరిధిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాచిగూడలోని కుత్బిగూడాకు చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు పాజిటివ్ నిర్ధరణ అయింది. అంబర్​పేట్​ న్యూ పటేల్ నగర్​లో ఓ వ్యక్తికి కరోనా సోకింది.

వికారాబాద్​లో 3... రంగారెడ్డిలో 4...

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి ధ్రువీకరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్​లో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా వచ్చిన ఓ వ్యక్తి కుటుంబంలోని వారందరికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.