జర్నలిస్టులకు కరోనా కిట్లు, బీమా సదుపాయం, ఆర్థిక సాయం అందించాలన్న వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, మీడియా అకాడమీని హైకోర్టు ఆదేశించింది.
న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సుమోటో పిల్‌గా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి, మీడియా అకాడమీకి నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి