ఏపీ సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం రేపింది. కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. నిందితుడికి పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: మద్యంమత్తులో తనను తాను గాయపర్చుకుని మందుబాబు హల్‌చల్