ETV Bharat / state

బ్యాంకింగ్​ రంగంపై కరోనా ప్రభావం... వైరస్ బారిన ఉద్యోగులు - Telangana news

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండడం వల్ల బ్యాంకింగ్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ఉద్యోగులు, అధికారులు మరింత అప్రమత్తతో విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి ఇటీవల చనిపోవడం వల్ల బ్యాంకర్లలో ఆందోళన మొదలైంది.

corona
బ్యాంకింగ్​ రంగంపై కరోనా ప్రభావం
author img

By

Published : Apr 15, 2021, 7:42 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌లో మాదిరి లక్షణాలు కనిపించడం లేదు. కానీ అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ అని నిర్ధరణ అవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విజృంభిస్తుండడం వల్ల అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం... ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే బ్యాంకర్లపై ఆ ప్రభావం అధికంగా పడుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో దాదాపు 1,000 మందికిపైగా ఈ కరోనా బారిన పడినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు.

కరోనాతో మేనేజర్ మృతి...

ఏపీ ఒంగోలు జిల్లా దర్శి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచి మేనేజర్‌ శేషుసాయి కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో బ్యాంకర్లలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే భారతీయ స్టేట్‌ బ్యాంకు... ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని... అన్ని ఎస్​బీఐ బ్రాంచిలకు జోనల్‌ కార్యాలయం సర్క్యులర్‌ జారీ చేసింది. ఏవైనా ముఖ్యమైన అంశాలు ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కావాలని కూడా స్పష్టం చేసింది.

పలు బ్యాంకుల్లో...

బ్యాంకు శాఖల్లో ఎక్కడైనా ఒకరిద్దరికి కరోనా పాజిటివ్‌ అని తెలియగానే ఆ బ్రాంచిలోని మిగిలిన సిబ్బందికి, అధికారులకు కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఆ బ్రాంచి మొత్తం శానిటైజ్‌ చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు.. 2, 3 గంటలపాటు మూసి తిరిగి తెరుస్తున్నారు. మరికొన్ని బ్యాంకులు అయితే ఆ రోజుకు సెలవు ప్రకటించి మరుసటి రోజు నుంచి యధావిధిగా నడిపిస్తున్నారు. బ్యాంక్​ ఆఫ్‌ ఇండియాలో ఇటీవల షాద్‌నగర్‌, సైనిక్​పురి, మల్కాజిగిరి, గోదావరిఖనిలోని జ్యోతినగర్‌ బ్రాంచిల్లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రాగా అందరికి పరీక్షలు నిర్వహించారు. ఆ రోజుకు పూర్తిగా సెలవు ప్రకటించారు.

సుమారు 400 మంది...

రాష్ట్రంలో ఒక్క భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన ఉద్యోగులే 350 నుంచి 400 మంది కరోనా బారిన పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. రోజూ 30 నుంచి 50 మందికి ఎస్​బీఐ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అవుతున్నట్లు వివరాలు సేకరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కరోనా వ్యాప్తి అన్నది ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల శాఖల్లో ఖాతాదారులకు ఉష్ణ్రోగ్రత పరీక్షలు నిర్వహించడం, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నారు.

జాగ్రత్తలు బ్యాంకర్లలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిరంతర సేవలు అందించే బ్యాంకర్లకు కరోనా ఇబ్బందులు తప్పడం లేదని యూనియన్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ అని నిర్ధరణ అయిన వారికి మెరుగైన వైద్యం అందేందుకు అవసరమైన చర్యలు ఆయా బ్యాంకుల యాజమాన్యాలు తీసుకోవాలని యూనియన్‌ ప్రతినిధులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా బాధితులపై రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.